గత నెలలో విజయవాడను బలంగా తాకిన భారీ వరద `నష్టాన్ని ఎంతిచ్చిందో.. కష్టం వచ్చినపుడు మనిషి కోసం మనిషి నిలబడతాడన్న ధైర్యాన్నీ అంతే ఇచ్చింది. యాంత్రిక యుగంలో మానవత్వం చచ్చిపోయిందని వ్యాఖ్యానించేవాళ్ల కళ్లు తెరిపించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పీకల్లోతు కష్టంలో మునిగిన ప్రజల కష్టాలను డిజిటల్ ఫ్రేమ్స్‌లో కళ్లారా చూసినవాళ్లు కదిలిపోయారు. కదలివచ్చారు. భౌతికంగా, సామాజికంగా, ఆర్థికంగా చేతనైన సాయం చేశారు. వరదకు ఎదురెళ్లి బాధితులను ఒడ్డుకు చేర్చిన సాహసులూ లేకపోలేదు. వరద తీవ్రత తగ్గగానే నీటిలో నానుతున్న బాధితులకు పలువురు ఆపన్నహస్తం అందించారు. రాష్ట్రాన్ని నడిపించే నాయకుడే తిండీతిప్పలు మర్చిపోయి వరద మిగిల్చిన బురదలో తిరుగుతుంటే `రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోలేదు. ఆయన అడుగులో అడుగేశారు. స్వచ్ఛందంగా కదలివచ్చి వరద సహాయక కార్యక్రమాలకు విస్తృత సేవలందించారు. తోటివాళ్లు కష్టంలో ఉన్నారు. మానవత్వం చూపించండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన చిన్న పిలుపు `వెల్లువెత్తిన వరదను జయించింది. వరద సైతం భయపడేంతగా దాతృత్వం పెల్లుబుకింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. సచివాలయంలో సీఎంని కలిసి విరాళాలు అందించేందుకు దాతలు వరుసలుగట్టారు. కష్టాల్లోవున్న బాధితులను ఆదుకునేందుకు తోడ్పాటునిచ్చిన దాతలను చూసి.. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కళ్లు చెమర్చాయంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే పేరెన్నికగన్న బడా పారిశ్రామికవేత్తల నుంచి, బుడిముడి అడుగులతో స్కూళ్లలో పాఠాలు నేర్చుకునే పసివాళ్ల వరకూ `ముఖ్యమంత్రి సహాయనిధికి తోచినంత విరాళమిచ్చారు. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, సినిమాస్టార్లు, వైద్యులు, వ్యాపారులు, ప్రభుత్వోద్యోగ సంఘాలు.. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. బాధితులను ఆదుకునే సహాయ ప్రక్రియలో భాగస్వామ్యమయ్యేందుకు ప్రతి ఒక్కరూ కదలి వచ్చినవారే. నువ్విస్తున్న నాలుగువేల పింఛను నా అవసరాలకు ఎక్కువే బాబు. అందులో రెండువేలు వరద బాధితులకు ఇస్తున్నానంటూ ప్రకటించిన పింఛనుదారులు ఎందరో. పాకెట్ మనీకోసం అమ్మానాన్నలు ఇచ్చే డబ్బు కిడ్డీబ్యాంకులో దాచుకుంటాను. అది పగులకొట్టి.. ఆ మొత్తాన్ని బాధితులకు సాయంగా తెచ్చాననని చెప్పిన పిల్లలు, యువకులు ఎందరో. అలాంటి సందర్భాలు ఎదురైనపుడే `ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు చెమర్చిన సందర్భాలు లేకపోలేదు.
ఇలా వారూ వీరిని కాకుండా.. రంగాలకు, ప్రాంతాలకు అతీతంగా.. ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ.. విద్యాసంస్థల నుంచి వ్యాపార సంస్థల వరకూ.. పిల్లల నుంచి పెద్దల వరకూ.. భారీగా విరాళాలు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా ఇచ్చేలానే ఉన్నారు. అలావచ్చిన మొత్తం.. ముఖ్యమంత్రి ప్రకటనలో రూ.400 కోట్లు. ఇది `కొన్ని రోజుల కిందట చంద్రబాబు చేసిన ప్రకటన. మానవత్వంలోనూ ఉద్యమస్ఫూర్తి చూపించారు దాతలు. వరదల కారణంగా ప్రభావితమైన నాలుగు లక్షలమందికి వరద సాయంగా రూ.602 కోట్లు వారి ఖాతాల్లో జమచేస్తే.. అందులో రూ.400 కోట్లు విరాళాలనుంచి వచ్చినవేనన్నది ముఖ్యమంత్రి మాట. ఇదొక చారిత్రక ఘట్టంగానూ అభివర్ణించారు సీఎం చంద్రబాబు. మరోవైపు విజయవాడ వరదల్లో రూ.6880 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని నివేదికలో పేర్కొంది. వరదల్లో 47 మంది చనిపోయారు. పాడి పశువులు చనిపోయాయి. భారీగా పంట నష్టం సంభవించిందని తెలిపింది. వందలమంది సర్వస్వం కోల్పోయారు. దీంతో బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం వరద సాయం ప్రకటించింది. ఇల్లు మునిగిపోయిన వారికి రూ.25 వేలు చొప్పున పంపిణీ చేసింది.

అబద్ధాలకు అన్న జగన్!
ప్రపంచస్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దడం `భ్రష్ట పాలకుడు జగన్‌కు ఇష్టం లేదు. అమరావతిని దెబ్బతీయడానికే మూడు రాజధానుల డ్రామాతో రాష్ట్రాన్ని, ప్రజలను మోసం చేసిన జగన్.. ఓటమి తరువాతా అదే కక్షను కొనసాగిస్తున్నాడు. అందులో భాగమే `మొన్నటి వరదల్లో అమరావతి మునిగిపోయిందంటూ చేసిన అబద్ధపు ప్రచారం. జగన్‌కు కావాల్సింది `రాజధానేతర ప్రజలను నమ్మించడం. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాజధానికి రాకుండా అడ్డుకోవడం. ఇదే జగన్ అబద్ధపు ప్రచార కుట్రలోని అంతరార్థం. అయితే అమరావతిపై జగన్ పరివారం సాగించిన ఘట్టాన్ని ఎవ్వరూ నమ్మలేదు. కృష్ణానది వరదలకు అమరావతి మునిగిపోయిందన్నది జగన్ పుట్టించిన అబద్ధం. చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద కృష్ణాకు రావడంతో.. తన అబద్ధాల ప్రచార పాచిక పారుతుందనే అనుకున్నాడు జగన్. కాని `ఉధృతంగా వరద వచ్చినా.. కరకట్టపై పొర్లి పారలేదని లోకమంతా చూసింది. కరకట్ట పైనుంచి వరద పారితే తప్ప అమరావతిలోకి వచ్చే అవకాశమే ఉండదు. భారీ వరదలు వచ్చినప్పటికీ అమరావతిని వరద తాకలేదు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మామూలుగా పనిచేశాయి. ముంపునకు గురికాని రక్షిత నగరంగా అమరావతి నిలిచింది. వరదను గెలిచింది.
భారీ వర్షాలకు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నైలలో జనజీవనం రోజులపాటు స్థంభించడం మనం చూడనిదీ కాదు, అలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. దక్షిణాదిలో తుఫాన్లకు త్రివేండ్రం, చెన్నై, విశాఖ, కర్నూలు నగరాలు కూడా అతలాకుతలమయ్యాయి. తుఫాన్లు, భారీ వర్షాలకు ఇతర నగరాలతో పోలిస్తే అమరావతి సురక్షితమనేది ఇటీవలి వరదలు రుజువు చేశాయి. జగన్ ఇకనైనా అమరావతిపై విషం కక్కడం మానుకుంటారా? నవ్విపోదరుగాక నాకేటి సిగ్గన్న రీతిన సొంత మీడియాలో అబద్ధాలు కొనసాగిస్తారా? చూడాలి.
ఇక `ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం మునిగిపోకుండా ఉండేందుకే వెలగలేరు గేట్లు ఎత్తేశారన్నది జగన్ సృష్టించిన మరో అబద్ధం. వెలగలేరు గేట్లు ఎత్తకముందే బుడమేరు నుంచి పోటెత్తిన వరద.. వెలగలేరు లాకుల కట్టపైపొర్లి అజిత్‌సింగ్‌నగర్ మీద పడిరది. లాకులు ఎత్తకుండా వుండివుంటే అన్నమయ్య డ్యాం మాదిరిగా మొత్తం కొట్టుకుపోయి.. భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేది. అలాగే లాకులు ఎత్తకముందే బుడమేరు డైవర్షన్ చానల్ పశ్చిమకట్ట తెగి వరద పొలాలపై పారి, తిరిగి కొండపల్లి వద్ద చానల్లోకిదూకి ఎదురుగా తూర్పువైపు గండిపడిరది. ఆ వరద రాయనపాడు, రాజరాజేశ్వరిపేటలను ముంచింది. దీనికి కారణం కృష్ణానది అప్పటికే ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. బుడమేరు నీరు కృష్ణలోకి చేరే పరిస్థితి లేదు. లాకులు తీసినా, తీయకున్నా.. విజయవాడకు ముంపు అనివార్యం. కారణం బుడమేరు కెనాల్ సామర్థ్యం 15వేల క్యూసెక్కులు కాగా.. వచ్చిన వరద 35 వేల క్యూసెక్కులు. బుడమేరు కెనాల్ పటిష్టతకు చంద్రబాబు మునుపటి ప్రభుత్వంలో విడుదల చేసిన కాంట్రాక్టు పనులను జగన్ సర్కారు పూర్తిచేసివుంటే.. ఇప్పుడు చర్చించుకునే పరిస్థితే ఉండేది కాదు. కానీ, జగన్ సర్కారు ఆ పనులను రద్దు చేసింది. పనులు చేపట్టలేదు సరికదా.. పైగా బుడమేరు గర్భాన్ని సైతం వైౖకాపా మూకలు దురాక్రమణ చేశాయి. కెనాల్‌బండ్ మట్టిని తవ్వుకుని అమ్మేసుకున్నాయి. ఈ కారణాలవల్ల విజయవాడ వరదకు గురైందిగానీ, వెలగలేరు లాకులు, చంద్రబాబు ఇల్లు కారణమనే జగన్ ప్రచారం పచ్చి అబద్ధం. వాస్తవాలను అధ్యయనం చేయడానికి వరద సమయంలో క్షేత్రస్థాయిలో పర్యటించిన పార్టీ నిపుణుల బృందం `జగన్‌రెడ్డి పచ్చి అబద్ధాల దురాగతాలను బట్టబయలు చేసింది.

నిజాయితీగా ఉండటమే నేరమా
కొన్నేళ్ల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. నిజాయితీ కలిగిన అధికారిని కాపాడతానని మాటివ్వడానికి వెళ్లిన హీరో.. ఆ ఇంట్లో ఓ మొక్కను చూసి అరుదైన జాతి మొక్కను జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. అంతకుమించి అరుదైన నిజాయితీ మనిషి నీ భర్త. అతన్నీ కాపాడుకోవాలి అన్న సీన్ సినిమాకు హైలెట్. నిజానికి ఆ నిజాయితీ అధికారిని సినిమాలో జనత గ్యారేజ్ టీం కాపాడుతుంది. అది సినిమా, రియలైఫ్‌లో అంతటి నిజాయితీ కలిగిన ఒక గ్రూప్1 స్థాయి అధికారిని మాత్రం.. సొంత డిపార్ట్‌మెంట్ దొంగలే క్రూరంగా కళ్లోల్లో కారంకొట్టి కర్రలతో చితకబాది పరారయ్యారు. ఇది రియల్ లైఫ్. ఈ సంఘటన జరిగింది ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో. సంచలనం రెకెత్తించిన సంఘటన కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో జరిగింది. ఉదంతంపై ఉద్యోగ సంఘాలు, జిల్లా అధికారులు తీవ్ర నిరసనకు దిగి కుట్రకోణాన్ని చేధించాలని డిమాండ్ చేయడం, జిల్లా కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగడంతో ఎట్టకేలకు పోలీసులు కేసును చేధించారు.
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా సహకార శాఖలో డిప్యూటీ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పోలిశెట్టి రాజశేఖర్ మీద కొందరు భౌతిక దాడికి పాల్పడ్డారు. పనిపట్ల నిబద్దత, అవినీతి అలసత్వంపై కఠినంగా ఉండటంతో పాటు ప్రజాక్షేత్రంలో, సహకార శాఖలో మంచి పేరు తెచ్చుకున్న నిజాయితీ గల అధికారిపై భౌతిక దాడికి పాల్పడటం సంచలనమే అయ్యింది. గత నాలుగేళ్లలో జిల్లా సహకార సంఘాల్లో జరుగుతున్న అనేక అక్రమాలు వెలికితీయడంతోపాటు ఎంక్వైరీలకు ఆదేశించడంతో కొంతమంది ఉద్యోగుల జీర్ణించుకోలేకపోయారు. దాదాపు 34 ఫేక్ పిటిషన్లు, వ్యక్తిత్వ హననం, విష ప్రచారంతో గడచిన నాలుగేళ్లు వేధింపులకు గురిచేశారు.
ఇలాంటి విషమ పరిస్థితుల్లో మరే అధికారి అయినా సెలవు మీద వెళ్లిపోతాడు లేదా ఆ పోస్టునుంచి తప్పుకుంటాడు. కానీ ఇతని పనితీరు మీద ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకున్న సహకార కమిషనర్ ఆ పిటిషన్లను, అప్పటి రాజకీయ నాయకుల సిఫారసులను చెత్తబుట్టలో పడేసి వెన్నుదన్నుగా నిలిచారు. జిల్లా కలెక్టర్లు కూడా యువ అధికారి పనితీరును అభినందిస్తూ 3 పర్యాయాలు ఉత్తమ అధికారిగా ప్రశంసపత్రం అందించారు. నిజాయితీ అధికారికి మద్దతుగా సహకార మరియు పాక్స్ ఉద్యోగ అసోసియేషన్లు నిలిచాయి.
డీసీఓగా 2021 ఫిబ్రవరిలో చార్జ్ తీసుకున్నది మొదలు గడిచిన నాలుగేళ్లలో అనేక ఎంక్వైరీలను వేయడం జరిగింది. ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. కారుమంచి పీఏసీఎస్, లింగంగుంట, ఎన్‌జీఓ సీహెచ్‌బిఎస్, కొమరోలు, పెద్ద కొత్తపల్లి, బి.నిడమనూరు, ఎం.నిడమనూరు, తర్లుబాడు పీసీఎస్‌లు, మార్కాపూర్ సీహెచ్‌బీఎస్, పల్లామల్లి పీఏసీఎస్, పొదిలి సీహెచ్‌బీఎస్, వేటపాలెం కో`ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలలో అక్రమాలను వెలికితీశారు. జరిగిన దాడిపై పోలీస్ ఎంక్వైరీ వేగంగా సాగడం, రాష్ట్రవ్యాప్తంగా సంఫీుభావం వెల్లువెత్తడంతో డిపార్ట్‌మెంట్‌లోని కుట్రదారులు అధికారి వ్యక్తిత్వాన్ని, కీర్తిని తగ్గించేందుకు, కేసును పక్కదారి పట్టించేందుకు సోషల్ మీడియా వేదికగా విషప్రచారానికీ దిగారు.
కేసును ఛేదించిన పోలీసులు
సంఘటన ప్రాంతంలోని సెల్యూలార్ డేటా డంప్‌ను విశ్లేషించిన పోలీసులు కారుమంచి సంఘానికి సంబంధించిన సస్పెండైన సీఈఓ శ్రీకాంత్ అతని మిత్రులతో కలిసి దాడి చేసినట్లు నిర్ధారణకు వచ్చి అరెస్టు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. రూ.కోటిన్నరకుపైగా అక్రమాలు ఈ సంఘంలో చోటుచేసుకున్నాయి. వీటిని వెలికితీయడమే ఈ అధికారి చేసిన పాపమా?.
